జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
- June 11, 2024
అమరావతి: జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేటు కలిగిన పార్టీగా జనసేన పార్టీ రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఏపీలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగినఉన్న పార్టీగా టీడీపీ తరువాత జనసేన రెండో స్థానంలో నిలిచింది. వైసీపీ నుండి కేవలం 11 మంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..