త్వరలోనే అందరినీ కలుస్తా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

- June 13, 2024 , by Maagulf
త్వరలోనే అందరినీ కలుస్తా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి: త్వరలోనే జిల్లాల వారిగా అందరినీ కలుస్తాను అని జసేన అధినేత, మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్న వారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్.

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని.. త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియ చేస్తామన్నారు. కాగా, తనకు అభినందనలు తెలియ చేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్. ఇక, ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

”ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకుని నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలను కలుస్తాను. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను” అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com