తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీ..
- June 15, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో భారీగా బదిలీలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత మంది ఐఏఎస్ లతోపాటు పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్‌గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆశీన్ సంగ్వన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణ పేట్ జిల్లాకు సక్తా పట్నాయక్, హనుమకొండ జిల్లాకు ప్రావిణ్య, జగిత్యాల జిల్లాకు సత్య ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లాకు విజియేంద్ర, మంచిర్యాల జిల్లాకు దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్, నల్లగొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు అదర్శ్ సురభి, వరంగల్ జిల్లాకు సత్య శారదా దేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్‌ను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బదిలీ అయిన ఐఎఎస్ అధికారుల వివరాలు...
ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ. జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్ గా ప్రతిక్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదా దేవి, ములుగు కలెక్టర్ గా టీఎస్ దివాకరా, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ బదిలీ
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









