ఏపీలో పేదలకు గుడ్ న్యూస్..

- June 17, 2024 , by Maagulf
ఏపీలో పేదలకు గుడ్ న్యూస్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేదలకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు.

త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. నివాస యోగ్యంగకాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూముల్లో ఇల్లు కట్టిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.

కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పలువురు కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. పాలనపై దృష్టి పెట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా కసరత్తులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నారు. దీంతో ప్రజా పాలన ప్రారంభమైందని పలువురు నేతలు అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూాడాలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com