వేదిక.! రాక రాక వస్తే ఏంటిలా.!
- June 17, 2024
అప్పుడెప్పుడో ‘విజయ దశమి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ వేదిక. అందానికి అందం, అభినయానికి అభినయం వున్న ముద్దుగుమ్మ వేదిక. అంతేకాదు, అప్పట్లో జూనియర్ నగ్మాగా పాపులర్ కూడా ఈ బ్యూటీ.
అయితే అదృష్టం కలిసి రాలేదు. ఏవో ఒకటీ అరా సినిమాలకు పరిమితమై పక్కకు తప్పుకుంది. సినిమాల్లో లేకపోయినా అడపా దడపా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూనే వుండేది. ఎట్టకేలకు ‘యక్షిణి’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అరుణ్ విజయ్ హీరోగా నటించగా, వేదిక టైటిల్ రోల్ పోషించింది. మంచు లక్ష్మి మరో కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ విజువల్ ఎఫెక్స్ట్ ప్రధానంగా తెరకెక్కింది. అంతా బాగానే వుంది. ఆడియన్స్ నుంచి కూడా ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది.
యక్షిణి పాత్రలో వేదిక అందాలను బాగానే వాడేశారు మేకర్లు.అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్ వివాదాల్లోకెక్కింది. వెంటనే ఓటీటీ నుంచి తీసేయాలంటూ హైకోర్టులో పిటీషన్ వేసింది ఓ ఎఫ్ఎమ్ ఛానెల్. ఆల్రెడీ ఇదే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ ఆడియో వెర్షన్లో ఈ ఎఫ్ఎమ్ ఛానెల్ ప్రదర్శించిందట. ఓ వెయ్యి ఎపిసోడ్లలా ప్రదర్శితమైన ‘యక్షిణి’ని కేవలం ఆరు ఎపిసోడ్లు మాత్రమే తాజాగా డిస్నీ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది.
అయితే, సదరు ఎఫ్ ఎమ్ ఛానెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ వెబ్ సిరీస్ నిర్మాతలపైనా, అలాగే డిస్నీ హాట్ స్టార్ పైనా హైకోర్టుపై ఫిటీషన్ వేసింది. చూడాలి మరి, ఈ వెబ్ సిరీస్ తొలిగించేస్తారా.? లేదంటే వివాదాన్ని సద్దుమనిగేలా చేస్తారో. పాపం.! వేదిక.. రాక రాక వచ్చిన ఛాన్స్.! ఏం జరుగుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









