ఇంత బిజీలోనూ ఆ క్యారెక్టర్ చేయడమవసరమా అంజలీ.?
- June 17, 2024
తెలుగమ్మాయ్ అంజలి నటిస్తే.. ఆ పాత్రలో అంజలి కనిపించదు. పాత్రే కనిపిస్తుంది చాలా నేచురల్‌గా. చాలా కాలంగా ఇండస్ర్టీలో వున్నప్పటికీ ఆశించదగ్గ స్టార్‌డమ్ అయితే అంజలికి దక్కడం లేదు. కానీ, అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయ్.
ఆ స్థాయిలో వున్న హీరోయిన్స్‌లో ఎవ్వరూ చేయనంతగా అంజలి ఏకంగా నాలుగు వెబ్ సిరీస్‌లు చేసేసింది. ప్రముఖ ఓటీటీ ఛానెళ్లలో ఆయా వెబ్ సిరీస్‌లు (ఝాన్సీ, ఫాల్ తదితర) స్ట్రీమింగ్ అవుతున్నాయ్. తాజాగా అంజలి నటించిన ఇంకో కొత్త వెబ్ సిరీస్ ’బహిష్కరణ‘ త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా వుంది.
జీ 5 వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అంజలి నటించిన ’గీతాంజలి మళ్లీ వచ్చింది‘ సినిమా ఇటీవలే ధియేటర్లలో రిలీజై ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఇలా చేతి నిండా సినిమాలూ, వెబ్ సిరీసులతో బిజీగా గడుపుతోన్న అంజలి, విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమాలో అంజలి చేసిన పాత్రపైనే ట్రోల్స్ జరుగుతున్నాయ్. వేశ్య పాత్రలో అంజలి నటించింది. ఆమెతో పలికించిన డైలాగులు కూడా బోల్డ్ గా వున్నాయ్ ఈ సినిమాలో. ఏమ్.! అవకాశాలు లేకనా.! ఇంత బిజీగా వుందిగా.!
అలాంటప్పుడు ఈ పాత్ర చేయకపోతే ఏం కొంపలు మునిగిపోయేవట.! అనవసరంగా ‘కక్కుర్తి’ అనే ముద్ర వేయించుకుంది. సోషల్ మీడియాలో అంజలిపై ఈ రకమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయ్. అంతేగా.! అదీ నిజమేగా.!
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







