వేదిక.! రాక రాక వస్తే ఏంటిలా.!

- June 17, 2024 , by Maagulf
వేదిక.! రాక రాక వస్తే ఏంటిలా.!

అప్పుడెప్పుడో ‘విజయ దశమి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ వేదిక. అందానికి అందం, అభినయానికి అభినయం వున్న ముద్దుగుమ్మ వేదిక. అంతేకాదు, అప్పట్లో జూనియర్ నగ్మాగా పాపులర్ కూడా ఈ బ్యూటీ.

అయితే అదృష్టం కలిసి రాలేదు. ఏవో ఒకటీ అరా సినిమాలకు పరిమితమై పక్కకు తప్పుకుంది. సినిమాల్లో లేకపోయినా అడపా దడపా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూనే వుండేది. ఎట్టకేలకు ‘యక్షిణి’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అరుణ్ విజయ్ హీరోగా నటించగా, వేదిక టైటిల్ రోల్ పోషించింది. మంచు లక్ష్మి మరో కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ విజువల్ ఎఫెక్స్ట్ ప్రధానంగా తెరకెక్కింది. అంతా బాగానే వుంది. ఆడియన్స్ నుంచి కూడా ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది.

యక్షిణి పాత్రలో వేదిక అందాలను బాగానే వాడేశారు మేకర్లు.అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్ వివాదాల్లోకెక్కింది. వెంటనే ఓటీటీ నుంచి తీసేయాలంటూ హైకోర్టులో పిటీషన్ వేసింది ఓ ఎఫ్‌ఎమ్ ఛానెల్. ఆల్రెడీ ఇదే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ ఆడియో వెర్షన్‌లో ఈ ఎఫ్‌ఎమ్ ఛానెల్ ప్రదర్శించిందట. ఓ వెయ్యి ఎపిసోడ్లలా ప్రదర్శితమైన ‘యక్షిణి’ని కేవలం ఆరు ఎపిసోడ్లు మాత్రమే తాజాగా డిస్నీ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది.

అయితే, సదరు ఎఫ్ ఎమ్ ఛానెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ వెబ్ సిరీస్ నిర్మాతలపైనా, అలాగే డిస్నీ హాట్ స్టార్ పైనా హైకోర్టుపై ఫిటీషన్ వేసింది. చూడాలి మరి, ఈ వెబ్ సిరీస్ తొలిగించేస్తారా.? లేదంటే వివాదాన్ని సద్దుమనిగేలా చేస్తారో. పాపం.! వేదిక.. రాక రాక వచ్చిన ఛాన్స్.! ఏం జరుగుతుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com