చిరు ఫిల్మ్ స్టూడియో హైదరాబాద్ లో..

- June 11, 2016 , by Maagulf
చిరు ఫిల్మ్ స్టూడియో హైదరాబాద్ లో..

ఆట, పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి, 150వ చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుంటుండగా.. 20న ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్టు సమాచారం. ఇక ఆ తర్వాత అంటే ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే కూడా ఉండడంతో ఈ డబుల్ బొనాంజాని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరు బర్త్ డే వేడుకలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఆగస్ట్ 14 నుండి ఆగస్ట్ 22 వరకు ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరపనున్నట్టు సమాచారం. కాణిపాకం, విజయవాడ, అంతర్వేది, శ్రీకాకుళం, వైజాగ్, జంగారెడ్డి గూడెం, సికిందరాబాద్, హైదరాబాద్ ..ఇలా పలు ప్రాంతాలలోని దేవాలయాలలో తొమ్మిది రోజుల పాటు అభిమానులు పూజలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వాటికి సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 14 ఆగస్ట్ నుండి 22 ఆగస్ట్ వరకు ప్రతి రోజు ఒక్కో ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం ఓ అవార్డ్ ఫంక్షన్‌లో లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేందుకు రిహార్సల్ చేస్తున్నట్టు వినికిడి. ఈ అవార్డ్ వేడుక జూన్ 12న జరగనుంది. ఇంక మరో విశేషమేమంటే చిరంజీవి హైదరాబాద్ అవుట్ స్కట్స్‌లో కొణిదెల ఫిల్మ్ స్టూడియోను స్థాపించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com