నవ్వుల పాలవుతోన్న ‘కన్నప్ప’.!

- June 17, 2024 , by Maagulf
నవ్వుల పాలవుతోన్న ‘కన్నప్ప’.!

భారీ బడ్జెట్ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న చిత్రమే ‘కన్నప్ప’. స్టార్టింగ్ నుంచీ ఈ సినిమాకి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా టీజర్‌ని హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ కేన్స్‌లో రిలీజ్ చేశారు.

అన్ని భాషల నుంచీ పలువురు ప్రముఖ నటీనటుల్ని ఈ సినిమాలో భాగం చేశారు, చేస్తున్నారు. ఇక, లేటెస్ట్‌గా టీజర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి, అనుకున్న అంచనాలకు తగ్గట్లుగా టీజర్ వుందా.? అంటే సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ్.

లీడ్ రోల్ పోషిస్తున్న మంచు విష్ణు వర్ధన్ గెటప్‌పైనే అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయ్. గాల్లో ఎగురుతూ బాణాలు వదిలేస్తూ.. బీభత్సంగా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు మంచు విష్ణు వర్ధన్‌పై. అంతా బాగానే వుంది. విజువల్స్ కూడా టీజర్ వరకూ ఓకే. కొత్తగా లేకపోయినా ఏదో చేశామని గొప్పగా అయితే చూపించే ప్రయత్నం చేశారు.

చెప్పినట్లుగానే శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, క్లారిటీ లేదు కానీ, ప్రబాస్ పాత్రను కూడా రివీల్ చేశారు. అయితే పూర్తిగా రివీల్ చేయలేదీ రెండు పాత్రల్ని. కళ్లు మాత్రమే చూపించారు. ఓ యాక్షన్ బ్లాక్‌ని మోహన్ లాల్‌పై కట్ చేశారు. ఇలా టీజర్ మొత్తాన్నీ ఓ భారీ యాక్షన్‌తో నింపేశారు. అన్నట్లు హీరోయిన్‌ని కూడా యాక్షన్ గాళ్‌గా చూపించారు. ఇదీ ‘కన్నప్ప’ టీజర్ కథ. మరి, అంచనాల సంగతి ఆయా ప్రేక్షకుల దృష్టికే వదిలేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com