వెనక్కి తగ్గిన ‘పుష్ప’.! రీజన్ అదేనా.?
- June 18, 2024
ఆగస్ట్ 15న ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప 2’ రిలీజ్ అవుతుందని గట్టిగా చెప్పింది చిత్ర యూనిట్. ఈ రిలీజ్ డేట్ విషయంలో మొదట్లో కొన్ని అనుమానాలున్నప్పటికీ మళ్లీ మళ్లీ అదే మాట నొక్కి వక్కానించింది సుక్కు అండ్ టీమ్.!
అయితే అంత చేసినా తప్పలేదు. రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఒక నెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా డిశంబర్కెళ్లిపోయింది. డిశంబర్ 6న ‘పుష్ప 2’ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
దాంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త ఢీలా పడిపోయారు. అయితే, ఇంత వెనక్కి వెళ్లడానికి కారణమేంటీ.? ప్రస్తుతం పరిస్థితులేమీ అల్లు అర్జున్‌కి అనుకూలంగా లేవు. ఎలక్షన్స్ టైమ్‌లో అల్లు అర్జున్ చేసిన ఓవరాక్షన్‌కి మెగా ఫ్యాన్స్ బన్నీపై గుస్సా అవుతున్నారు.
బన్నీకి సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ వున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యాన్సే. దాంతో, ఈ టైమ్‌లో ‘పుష్ప 2’ రిలీజ్ చేస్తే అది అల్లు అర్జున్‌కి ఖచ్చితంగా దెబ్బ పడే పరిస్థితే అవుతుంది. ఇదో రీజన్ కాగా, భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా సినిమా ఇది. దాంతో, ప్రతి చిన్న విషయమూ చాలా జాగ్రత్తగా చూసుకోవల్సి వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







