ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు

- June 20, 2024 , by Maagulf
ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తక్షణమే డీజీపీగా నియామకం అమల్లోకి వస్తుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com