కువైట్‌లో డెలివరీల పై ఆంక్షలు

- June 20, 2024 , by Maagulf
కువైట్‌లో డెలివరీల పై ఆంక్షలు

కువైట్: వేసవి ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలకు చేరుకోవడంతో కువైట్  ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై డెలివరీ బైక్‌లను నడపడంపై నిషేధం విధించింది. నిషేధం జూన్ 23 నుండి ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కంపెనీలు తప్పనిసరిగా ఈ ఆదేశాన్ని పాటించాలని లేదా ఉల్లంఘించినవారికి జరిమానాల విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ చర్య మోటార్‌సైకిల్ రైడర్‌ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com