మూడు ఆఫ్రికా దేశాల్లో రాష్ట్రపతి పర్యటన

- June 12, 2016 , by Maagulf
మూడు ఆఫ్రికా దేశాల్లో రాష్ట్రపతి పర్యటన

 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేటి నుంచి ఆరు రోజుల పాటు మూడు ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ఐవరీ కోస్ట్‌, నమీబియాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, ఆర్మీ సైనికాధిపతి దల్బీర్‌ సింగ్‌లు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐవరీ కోస్ట్‌, ఘనాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ తొలి పర్యటన కాగా.. నమీబియాలో 21 సంవత్సరాల తర్వాత మళ్లీ భారత రాష్ట్రపతి పర్యటించనున్నారు.
విద్య, సామాజిక, ఆర్థిక అంశాలకు చెందిన పర్యటన అని ఎంవోఎస్‌ సింగ్‌ వెల్లడించారు.
పర్యటనలో భాగంగా ఆయన ఘనా రాజధాని అక్రాలోని అధ్యక్ష భవనంలో జరిగే ఉన్నతాధికారులతో సమావేశమై మాట్లాడనున్నారు. ఐసీసీఆర్‌ బహుమతిగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు భారత్‌-ఘనా కోఫి అన్నన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బంది మాట్లాడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com