‘గేమ్ ఛేంజర్’ ముందుకు కదలనుందా.?
- June 24, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావల్సి వుండగా, శంకర్ ‘ఇండియన్ 2’ కమిట్మెంట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుండడం.. అలాగే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుండడం జరిగింది.
ఇక, ‘ఇండియన్ 2’ రిలీజ్కొచ్చింది. సో, ‘గేమ్ ఛేంజర్’ని శంకర్ అండ్ కో ముందుకు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారనీ తెలుస్తోంది. దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా త్వరలో కంప్లీట్ చేసేయనుందట.
ఇక, రిలీజ్ విషయానికి వస్తే, నిన్న మొన్నటి వరకూ ఈ ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ లేనట్లే అని చేతులెత్తేశారన్న వార్త హల్ చల్ చేసింది. కానీ, రిలీజ్ డేట్ ప్రకటించేందుకు మేకర్లు సిద్ధమవుతున్నారట.
అందులో భాగంగానే జూలైలో ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారనీ తెలుస్తోంది. బహుశా దీపావళికి కానీ, తప్పితే క్రిస్మస్కి కానీ ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







