జర్నలిస్టులకు తెలంగాణ ఆర్టీసీ తీపికబురు..
- June 25, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బస్ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్ఆర్టీసీ పొడిగించింది.
అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కాలపరిమితి పొడిగించిన ఈ బస్ పాస్‌లను గతంలో మాదిరిగానే https://tgsrtcpass.com/journalist.do?category=Fresh లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో, అక్రిడిటేషన్ కార్డులను విధిగా అప్లోడ్ చేయాలి. బస్ పాస్ కలెక్షన్ సెంటర్‌నూ ఎంపికచేసుకోవాలి. ఈ దరఖాస్తులను సమాచార, పౌరసంబంధాల శాఖ ఆన్ లైన్ లో దృవీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్ పాస్‌లను టీజీఎస్ఆర్టీసీ జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







