విదేశీయులు చట్టవిరుద్ధంగా హజ్.. సౌదీ
- June 25, 2024
రియాద్: హజ్ కోసం ఉద్దేశించబడని వీసాలు జారీ చేయడం ద్వారా అనేక స్నేహపూర్వక దేశాలకు చెందిన కొన్ని పర్యాటక సంస్థలు తమ విజిట్ వీసా హోల్డర్లను మోసం చేశాయని, మక్కా రెండు ప్రాంతాల్లో ఉంటూ నిబంధనలను ఉల్లంఘించేలా ప్రోత్సహించాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా ప్రతినిధి కల్నల్ తలాల్ అల్-షల్హౌబ్ తెలిపారు. కల్నల్ అల్-షల్హౌబ్ ఓ ఇంటర్వర్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు హజ్ కోసం ఉద్దేశించని విజిట్ వీసాలు, ఇతర వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. “అనుమతులు లేకుండా హజ్ చేయడానికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాలను తీవ్రతరం చేశాం. ఉల్లంఘించిన వారిపై కఠినమైన జరిమానాలను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ చురుకైన చర్యలు తీసుకుంది. హజ్ పర్మిట్ అనేది కేవలం ట్రాన్సిట్ కార్డ్ మాత్రమే కాదు, యాత్రికులకు యాక్సెస్‌ను సులభతరం చేసే కీలకమైన సాధనం. ”అని తెలిపారు. హజ్ సీజన్లో మొత్తం మరణాలలో 83 శాతం, 1,301 మందిలో 1,079 మంది హజ్ అనుమతి లేనివారేనని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







