దుబాయ్ లో తెలుగు వ్యక్తికి రూ.2 కోట్ల లాటరీ...
- June 25, 2024
దుబాయ్: దుబాయ్ కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ తెలుగు వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు.అతను ఏకంగా 1 మిలియన్ దిర్హాములు(రూ.2 కోట్ల) కు పైగా లాటరీ గెలిచాడు.దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అయితే, తనకేమీ గెలుపు ఊరికే దక్కలేదు.నెల నెలా తాను పొదుపు చేసిన మొత్తంలోనుంచే అతను ఈ లాటరీ టికెట్ గెలిచాడు.
ఉపాధి కోసం దుబాయ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం పట్టింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నాడు.నేషనల్ బాండ్స్ సేవింగ్స్ స్కీమ్ చందాదారులకు ఆఫర్ కింద లక్కీ డ్రా నిర్వహించగా అందులో సదరు యువకుడు గెలిచాడు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ అనే వ్యక్తి ఉపాధి కోసం 2017లో యూఏఈ వచ్చాడు. దుబాయ్ లో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అలా కరెంటు పని చేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన జీతం నుంచి నెల నెలా కొంత డబ్బు దాదాపు 100 దిర్హాములను నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేస్తూ వచ్చాడు.అయితే, ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి బ్యాంకు సదరు నిర్వాహకులు రివార్డు ప్రోగ్రామ్ కింద లక్కీ డ్రా తీశారు. దీంతో అతని పేరు రావడంతో భారీ మొత్తాన్ని గెల్చుకున్నాడు.
గ్రాండ్ ప్రైజ్ అనే కేటగిరీలో తీసిన లాటరీలో బోరుగడ్డ నాగేంద్రమ్ అందరికంటే ముందు విజేతగా నిలిచారు. అలా నగదు బహుమతి దాదాపు 1 మిలియన్ దిర్హాములు అందుకున్నారు. . ఈ ప్రైజ్ మనీ గెలిచినట్లు నిర్వాహకులు బోరుగడ్డ నాగేంద్రమ్ కు తెలపడంతో ఇక ఆయనకు అంతులేని ఆనందం పొందాడు. ఆ డబ్బు తన పిల్లల ఉన్నత చదువుల కోసం తనకు అక్కరకు వస్తుందని.. వారి భవిష్యత్తు బంగారంగా ఉంటుందని నాగేంద్రమ్ ఆనందం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







