విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక
- June 25, 2024
న్యూ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో కూటమి తరఫున విపక్ష నేతగా ఎన్నికయ్యారు.
నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. వారందరూ లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు.
స్పీకర్ పదవి కోసం తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్న నేపథ్యంలో, ఇండియా కూటమి నుంచి విపక్ష నేత ప్రకటన వెలువడింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి అభ్యర్థికి ఇచ్చేందుకు ఎన్డీయే ససేమిరా అనడంతో, స్పీకర్ పదవికి ఎన్నిక జరపాల్సిందేనని ఇండియా కూటమి పట్టుబట్టడం తెలిసిందే. లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్డీయే తరఫున ఓం బిర్లా బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె. సురేశ్ ను పోటీలోకి దించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







