జామ కాయలే కాదు, ఆకుల్లోనూ ఔషధాలున్నాయ్ సుమీ.!

- June 25, 2024 , by Maagulf
జామ కాయలే కాదు, ఆకుల్లోనూ ఔషధాలున్నాయ్ సుమీ.!

కడుపు నిండా సుష్టిగా తిన్న తర్వాత ఒక్క జామ కాయ తింటే తిన్నది ఈజీగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు, జామ కాయల్లోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్థులు ఖచ్చితంగా తినాల్సిన పండు జామ కాయ.

అయితే, పచ్చి జామ కాయను మాత్రమే డయాబెటిక్ ఫేషెంట్లు తీసుకోవాల్సిన ఆవశ్యకత వుంది. పండు కాయలో షుగర్ లెవల్స్ పెంచే ప్రభావం వుంటుంది. అదే పచ్చి కాయలో అయితే, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో వుంచే గుణం ఎక్కువ.

అసలు మ్యాటర్ ఏంటంటే, జామ కాయలే కాదండోయ్ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తాజా సర్వేలో తేలింది. జామ కాయలే కాదు, ఉదయాన్నే నాలుగు లేత జామ ఆకులు నమిలితే ఊబకాయం అదుపులో వుంటుంది. అలాగే డయాబెటిస్ కూడా.

అంతేకాదు, జామ ఆకుల్లో యాంటి అలెర్జిక్ గుణాలు ఎక్కువ. అందుకే ప్రతీరోజూ వీటిని ఖాళీ కడుపుతో తింటే, ఏ రకమైన అలర్జీలైనా ఇట్టే తగ్గుముఖం పడతాయ్. జామ ఆకుల్లోని ఫైబర్, విటమిన్ ‘ఎ’, ‘సి’ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఏమైనా దంత సమస్యలున్నా సరే, జామ ఆకులు నమిలితే ఖచ్చితంగా ఉపశమనం వుంటుందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com