త్వరలో మరిన్ని పథకాలు ప్రారంభించనున్న ఐఆర్‌సీటీసీ..

- June 12, 2016 , by Maagulf
త్వరలో మరిన్ని పథకాలు ప్రారంభించనున్న ఐఆర్‌సీటీసీ..

 రైలు దగ్గరకే భోజనం ఇతర సేవలు త్వరలో మరిన్ని పథకాలు ప్రారంభించనున్న ఐఆర్‌సీటీసీ భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) సేవలను విస్తృతం చేశారు. పర్యాటక సేవలతో పాటు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు పలు కొత్త పథకాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. దీంతో ఐఆర్‌సీటీసీ అంతర్జాల సేవలకు ప్రయణికుల నుంచి ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో రైలు రిజర్వేషన్‌ టికెట్టు తీసుకోవాలంటే చాంతాడంత వరుసల్లో గంటల తరబడి నిలబడి సమయం వృథా అయ్యేది.
ఇక రైల్లో ఆహారం దారుణంగా ఉండేది. నాణ్యమైన ఆహారం లభించేదికాదు. తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన మార్పులతో ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఒక చరవాణి సందేశంతో రైలు వద్దకే తెప్పించుకుంటున్నారు. త్వరలోనే రైల్వే విశ్రాంతి గదుల నిర్వహణను కూడా ఈ సంస్థే చేపట్టనుంది. అలాగే కొత్తగా మరిన్ని పథకాలతో ఆదరణ పెంచుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఈ క్యాటరింగ్‌, ఇతర సేవలపై 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక కథనం..
విజయవాడ ఐ ఆర్‌సీటీసీ ద్వారా రైల్వే రిజర్వేషన్‌ టికెట్లు సులువుగా పొందవచ్చు. ఏదైనా బ్యాంకు ఖాతా ఉన్న ప్రయాణికుడు తమ పేరు, ఫోన్‌ నెంబరు ద్వారా సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొత్తగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిజర్వేషన్‌ టికెట్లు తీసుకోవచ్చు. సంస్థ నిర్దేశించిన నిర్ణీత సమయాల్లో తత్కాల్‌ టికెట్లు కూడా పొందవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం రద్దయితే రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండానే టికెట్లను రద్దు చేయడం, రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ అయిన రైలు వెళ్లిపోతే టీడీఆర్‌ ఫైల్‌ చేయడం ద్వారా నగదు వెనక్కి తీసుకోవడం కూడా చేయొచ్చు. రద్దయిన టికెట్టు డబ్బులు మూడు రోజుల వ్యవధిలో తమ బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. అన్ని ఆండ్రాయిడ్‌ చరవాణుల్లో ఐఆర్‌సీటీసీ కనెక్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు
ఓ సందేశం.. నచ్చిన భోజనం.. రైలు ప్రయాణంలో ప్రయాణికులకు నచ్చిన ఆహారం కావాలంటే చరవాణి నుంచి ' ఎస్‌ఎంఎస్‌ మీల్‌ పీఎన్‌ఆర్‌' అని టైప్‌ చేసి 139కి సందేశం పంపాలి. సంస్థ ప్రతినిధి ఫోన్‌ చేసి ఆర్డ్‌ర్‌ తీసుకుంటారు. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌, నిరీక్షణ జాబితా టికెట్టు ఉన్న ప్రయాణికులు కూడా ఈ సేవలు పొందవచ్చు. నగదును ఏదైనా బ్యాంకు డెబిట్‌కార్డు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జమ చేయొచ్చు లేదా రైలు వద్దకు వచ్చే హోటళ్ల సిబ్బందికి ఇవ్వొచ్చు. ఏయే వూళ్లు, స్టేషన్లు, ఏయే రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉందో సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రైలు స్టేషన్‌కు చేరుకునే రెండు గంటల ముందుగా చరవాణి సందేశం పంపాల్సి ఉంటుంది. ఆర్డర్‌ కన్ఫమ్‌ చేసుకుంటే రైలు సంబంధిత స్టేషన్‌కు చేరుకోగానే ఆయా హోటళ్ల సిబ్బంది బెర్తు వద్దకే వచ్చి ఆహారాన్ని అందిస్తారు. కనీస ఆర్డ్‌ర్‌ రూ.60 అయినా ఉండాలి. ఈ సేవలు అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లతోపాటు బయట ప్రముఖ హోటళ్ల నుంచి కూడా ఆహార పదార్థాలు ఆర్డ్‌ర్‌ చేయొచ్చు. దీని కోసం ప్రత్యేక యాప్‌ కూడా రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొని సులువుగా బుక్‌ చేసుకోవచ్చు. సంస్థ టోల్‌ఫ్రీ నెంబరు 1323 ద్వారా కూడా సమస్త సమాచారాన్ని ప్రయాణికులు పొందవచ్చు
టికెట్టు రద్దు ఇలా.. సంస్థ ఈ టికెటింగ్‌ ద్వారా తీసుకున్న టికెట్టు కాకుండా దేశంలోని అన్ని రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల్లో తీసుకున్న రైల్వే టికెట్లు కూడా సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా రద్దు చేసుకునే సౌకర్యం ఇటీవల కొత్తగా అందుబాటులోకి వచ్చింది. టికెట్టులోని పీఎన్‌ఆర్‌, రైలు నెంబరు నమోదు చేసి రద్దు చేసుకోవచ్చు. అనంతరం ఫోన్‌కు వచ్చిన సందేశాన్ని అన్ని రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల్లో చూపిస్తే సిబ్బంది నగదు వాపసు చేస్తారు
ఇతర సేవలు ఇలా.. వీల్‌చైర్‌.. ప్రస్తుతం ఈ సౌకర్యం విజయవాడ, సికింద్రాబాద్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు నిర్ణీత రుసుము చెల్లించడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు
విజయవాడ రైల్వేస్టేషన్‌తోపాటు డివిజన్‌లోని అన్ని ముఖ్య రైల్వేస్టేషన్లలో ఉన్న విశ్రాంతి గదులను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. అలాగే అన్ని ప్రధాన పట్టణాల్లో అందుబాటులో ఉన్న తక్కువ ధరకే లభించే ' ఓయొ' హోటల్స్‌లోని గదులను కూడా సంస్థ వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చు
సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరచిన ప్రధాన నగరాల్లో క్యాబ్‌లు, బస్సులు, ఈ బెడ్‌రోల్స్‌, విమనా టికెట్లు కూడా పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com