డిసెంబర్ 12 నుంచి ‘మనామా హెల్త్ కాంగ్రెస్-ఎక్స్‌పో 2024’
- July 01, 2024
మనామా: బహ్రెయిన్ GCCలో అతిపెద్ద మెడికల్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో డిసెంబర్ 12 నుంచి 14 వరకు మనమా హెల్త్ కాంగ్రెస్, ఎక్స్‌పో 2024 జరగనుంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) సీఈఓ మరియం అల్ జలహ్మా తెలిపారు. ఈ సంవత్సరం ఈవెంట్‌లో బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్, తమ్‌కీన్ వంటి భాగస్వాములతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ని కలిగి ఉన్న ఆరోగ్య సంరక్షణ రంగంలో స్థిరత్వంపై ప్యానెల్ చర్చ కూడా ఉంటుందన్నారు. మనామా హెల్త్ 2024 GCC, మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద హెల్త్‌కేర్ కాంగ్రెస్ మరియు ట్రేడ్ షో అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరికొత్త వైద్య పరికరాలు, ఉత్పత్తులు మరియు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతను ప్రదర్శించడానికి వేదికను ఈ ఈవెంట్ అందిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాంకేతికత కోసం బహ్రెయిన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో ఒకటిగా నిలవబోతోందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







