కువైట్ లో అగ్నిప్రమాదాల నివారణకు భారీ ప్రాజెక్ట్..!

- July 02, 2024 , by Maagulf
కువైట్ లో అగ్నిప్రమాదాల నివారణకు భారీ ప్రాజెక్ట్..!

కువైట్: భవనాల్లోని ఫైర్ అలారం సిస్టమ్‌లను KFF సెంట్రల్ కమాండ్‌కి అనుసంధానించే ప్రాజెక్ట్‌కు ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, ఆస్తులను రక్షించే అవకాశం ఉందని మరియు సామాజిక భద్రతను సాధించవచ్చని కువైట్ ఫైర్ ఫోర్స్ యాక్టింగ్ చీఫ్, మేజర్ జనరల్ ఖలీద్ అబ్దుల్లా ఫహద్ తెలిపారు. లింకింగ్ ప్రాజెక్ట్‌ను పరిశీలించే పనిని ఒక బృందానికి అప్పగించినట్లు ఆయన వివరించారు.  ఇది 50,000 కంటే ఎక్కువ భవనాలను సెంట్రల్ కమాండ్‌కు అనుసంధానించే ఒక ప్రధాన ప్రాజెక్ట్ అని మేజర్ జనరల్ తెలిపారు.  ప్రాజెక్ట్ మూడు భాగాలుగా ఉంటుందని.. కొత్త, పాత భవనాలు ఇప్పటికే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయన్నారు. సెంట్రల్ కమాండ్‌కు సమాచారం అందగానే 120 సెకన్లలోపు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

2023 సంవత్సరానికి సంబంధించిన మొత్తం 16,080 సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అల్-ఫర్వానియాలో అధికంగా ఫైర్ ప్రమాదాలు జరిగాయని వివరించారు. 10 నుండి 19 నిమిషాల మధ్య సుదీర్ఘమైన అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోగా..38 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని, 2022 కంటే ఇది 25 శాతం తగ్గుదల అని వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com