యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- March 02, 2026
యూఏఈః పశ్చిమాసియా అగ్నిగుండగా మారింది. గల్ఫ్ దేశాలలో హై అలెర్ట్ కొనసాగుతోంది. జీసీసీ దేశాలు తమ గగనతలాలను పూర్తి మూసివేశాయి. మరోవైపు, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఏకంగా 165 బాలిస్టిక్ మిస్సైల్స్, 541 డ్రోన్లను ప్రయోగించింది. కాగా, ఇందులో 152 మిస్సైళ్లను గాలిలోనే అడ్డుకున్నామని, మరో 13 సముద్రంలో కూలిపోయాయని యూఏఈ ప్రకటించింది. అలాగే, 506 డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నామని, కానీ 35 డ్రోన్లు మాత్రం రెసిడెన్షియల్ ప్రాంతాలను ఢీకొట్టాయని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన మొత్తం ముగ్గురు ప్రవాసులు మరణించగా, 58 మంది ప్రవాసులు గాయపడ్డారని యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే, మిస్సైల్స్ మరియు డ్రోన్ల నుండి వచ్చిన శిథిలాలు సివిలియన్ ఆస్తులకు నష్టాన్ని కలిగించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ నుండి జరుగుతున్న దాడులను యూఏఈ వైమానిక దళం మరియు వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రజలు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని, అలాగే వాటిని షేర్ చేయొద్దని సూచించింది. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వనరుల నుంచి తెలుసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







