జెడ్డా ఇస్లామిక్ పోర్ట్..భారీ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- July 02, 2024
జెడ్డా: సౌదీ అరేబియాకు 3,633,978 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాలను జెద్దా ఇస్లామిక్ పోర్ట్‌లోని కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు భగ్నం చేశారు. ఓడరేవులో "ఇనుప సామగ్రి"తో కూడిన షిప్మెంట్లో రహస్యంగా దాచిన మాత్రలను ఆధునిక భద్రతా పద్ధతులను ఉపయోగించి గుర్తించినట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. [email protected] కు ఇమెయిల్ ద్వారా లేదా అంతర్జాతీయ నంబర్ 00966114208417 ద్వారా, 1910ని సంప్రదించడం ద్వారా స్మగ్లింగ్ కు చెందిన సమాచారాన్ని అందజేయాలని కోరింది. సరైన సమాచారం అందజేసిన వారికి ఆర్థిక రివార్డులను అందిస్తామని, వివరాలను రహస్యంగా పెడతామని తెలియజేసింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







