మ్యాంగో ఫెస్టివల్.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..!
- July 02, 2024
దోహా: సూక్ వాకిఫ్ 'అల్ హంబా'లో ప్రారంభమైన పాకిస్థాన్ మ్యాంగో ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మొదటి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో మామిడి అమ్మకాలు జరిగాయి. ఎగ్జిబిషన్లో ఇప్పటి వరకు మొత్తం 92,363 కిలోల మామిడి పండ్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు 14,533 కిలోలు, రెండో రోజు 31,368 కిలోలు, 3వ రోజు 26,585 కిలోలు, 4వ రోజు: 19,877 కిలోలు సేల్ అయినట్లు తెలిపారు. జూలై 6 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇందులో సింధ్రి, చౌన్సా, సఫీద్ చౌన్సా, అన్వర్ రటూల్ మరియు దుసేరితో సహా అత్యుత్తమ మామిడి పళ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







