మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- July 03, 2024
యూఏఈ: అగ్రశ్రేణి ఫ్రీడైవింగ్ నిపుణులలో ఒకరైన జరీర్ సైఫుద్దీన్..ఇటీవలి ఫ్రీడైవింగ్ మరియు స్పియర్ ఫిషింగ్ ట్రిప్‌లో మరణానికి చేరువగా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్రీడైవింగ్ అనేది డైవర్లు స్కూబా పరికరాలను ఉపయోగించని టెక్నిక్. వారు సముద్రంలో లోతుగా డైవ్ చేస్తారు. వారు వీలైనంత కాలం శ్వాసను బిగపట్టి డైవ్ చేస్తారు. ఈ సాంకేతికత పెర్ల్ డైవింగ్ పురాతన సంప్రదాయంలో వాడుకలో ఉంది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. జరీర్ ఒడ్డు నుండి అనేక కిలోమీటర్ల దూరంలో తన స్నేహితులతో డైవింగ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు స్పృహ కోల్పోయి దాదాపు మునిగిపోయాడు. అతని స్నేహితులు, సహాయం కోసం కేకలు వేశారు. అతన్ని దుబాయ్ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూన్ ఐలాండ్‌కు దగ్గరగా తరలించారు. అప్పటికే ఊపిరితిత్తులు నీళ్లతో నిండిపోవడంతో సెమీ స్పృహలో ఉన్నట్లు వారు తెలిపారు. అదృష్టవశాత్తూ దుబాయ్ రాజకుటుంబానికి చెందిన సభ్యుడు సమీపంలో ఉన్నాడు. అతడిని రక్షించడంలో సహాయం చేయడానికి అతని వ్యక్తిగత వైద్య బృందాన్ని పురమాయించాడు. అనంతరం మూన్ ఐలాండ్ నుండి దుబాయ్ పోలీసు హెలికాప్టర్ ద్వారా ఫ్రీడైవర్‌ను వెంటనే రషీద్ హాస్పిటల్ కు తరలించారు. తనను కాపాడిన ప్రతి ఒక్కరికి జరీర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను రక్షించిన రాయల్ ఫ్యామిలీ మెంబర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







