హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- July 03, 2024
దుబాయ్: హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడిని సంబంధిత అధికారులకు నివేదించడంలో విఫలమైనందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ తండ్రి దుబాయ్ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రకారం..అక్టోబర్ 6న తన కొడుకు తన స్నేహితుడిని చంపాడు. ఈ విషయం అతనికి తెలుసని, ఈ ఘటనపై దుబాయ్ క్రిమినల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.
షార్జాలో హంతకుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణలో అతని తండ్రికి నేరం గురించి తెలిసినప్పటికీ, అధికారులకు నివేదించలేదని తేలింది. విచారణ ప్రకారం.. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న తన మరో కుమారుడు షార్జాలో హోటల్ గదిని, నిందితుడైన కుమారుడికి విమాన టిక్కెట్టును ఏర్పాటు చేసినట్లు తండ్రికి తెలుసని అధికారులు విచారణలో గుర్తించారు.
మరోవైపు హత్య గురించి తెలియక తనను అపార్ట్‌మెంట్‌కు పిలిపించారని విచారణలో తండ్రి చెప్పాడు. ఇదే విషయమై అతని కుమారుడిని అడగడంతో, అతడు తనను కట్టివేశాడని పేర్కొన్నాడు. నేరాన్ని అధికారులకు నివేదించడంలో విఫలమయ్యాడనే ఆరోపణను తండ్రి ఖండించాడు. అతను తన కొడుకును చూసి షాక్ అయ్యాడని, భయభ్రాంతులకు గురిచేశాడని, ఇది నేరాన్ని నివేదించకుండా చేసిందని తెలిపాడు.
శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 323ని ప్రస్తావిస్తూ, నేరాన్ని నివేదించడంలో విఫలమైతే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడితో తండ్రికి ఉన్న సంబంధం మరియు అతని వయసు దృష్టిలో ఉంచుకుని, అతనిని శిక్ష నుండి మినహాయించేందుకు ఆర్టికల్ 323 ప్రకారం కోర్టు తన విచక్షణాధికారాన్ని కోర్టు వినియోగించుకుంది. ఈ కేసులో తండ్రిని నిర్దోషిగా విడుల చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం