‘టిల్లు క్యూబ్’లో ఆ హీరోయినా.?

- July 09, 2024 , by Maagulf
‘టిల్లు క్యూబ్’లో ఆ హీరోయినా.?

‘డీజె టిల్లు’ సినిమాతో సంచలన విజయం అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మొదటి పార్ట్ అంత కాకపోయినా, ఓ మోస్తరు హిట్ టాక్‌తో ఈ సినిమా నెట్టుకొచ్చేసింది.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమా పరమేశ్వరన్ మాత్రం క్రేజీ హీరోయిన్ అయిపోయింది. స్టన్నింగ్ క్యారెక్టర్‌లో కనిపించి వావ్ అనిపించింది.

ఇప్పుడు ఈ సినిమాకి మూడో పార్ట్ కూడా తెరకెక్కబోతోందట. ఆ పార్ట్‌లో హీరోయిన్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘ట్యాక్సీవాలా’ ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ తదితర సినిమాల్లో నటించిన ప్రియాంకా జవాల్కర్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుకుంటున్నారట.

ఈ ముద్దుగుమ్మ చేసినవి తక్కువ సినిమాలే అయినా మస్త్ క్రేజ్ వుంది యూత్‌లో. టిల్లుగానికున్న క్రేజ్‌కి అందుకు తగ్గట్లు క్రేజ్ వున్న ముద్దుగుమ్మ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. ఆ నేపథ్యంలో ప్రియాంక పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

ఒకవేళ అదే జరిగితే, ప్రియాంకా జవాల్కర్  దశ తిరిగినట్లే. మళ్లీ ఫామ్‌లోకి రావడం పక్కా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com