అరుదైన గౌరవం.. అబుదాబిలో ఓ వీధికి భారతీయుడి పేరు

- July 12, 2024 , by Maagulf
అరుదైన గౌరవం.. అబుదాబిలో ఓ వీధికి భారతీయుడి పేరు

యూఏఈ: ఓ భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఎమిరేట్ హెల్త్‌కేర్ సెక్టార్‌కు గణనీయమైన కృషి చేసిన భారతీయ మూలాలు కలిగిన 84 ఏళ్ల యూఏఈ పౌరుడు డాక్టర్ జార్జ్ మాథ్యూ పేరును  అబుదాబిలోని ఒక వీధికి పెట్టి గౌరవించారు. 1967లో 26 ఏళ్ల యువకుడిగా యూఏఈకి వచ్చారు డాక్టర్ మాథ్యూ. అబుదాబిలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అల్ ఐన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన మొదటి వైద్యుడు కూడా ఆయనే కావడం విశేషం.  ఆయన సేవలను గుర్తిస్తూ  అల్ మఫ్రాక్ ప్రాంతంలోని షేక్ షఖ్‌బౌట్ మెడికల్ సిటీ (SSMC) సమీపంలోని రహదారికి జార్జ్ మాథ్యూ స్ట్రీట్ అని పేరు పెట్టారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (DMT) ద్వారా 'ఆనరింగ్ యూఏఈ విజనరీస్: మెమోరేటివ్ స్ట్రీట్స్' ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ గౌరవాన్ని అందించారు.     

జనరల్ ప్రాక్టీషనర్‌గా తన సేవలను ప్రారంభించిన డాక్టర్ మాథ్యూను స్థానికులు ముద్దుగా 'మత్యస్' అని పిలుస్తారు. 1972లో అల్ ఐన్ ప్రాంతానికి మెడికల్ డైరెక్టర్‌గా, 2001లో హెల్త్ అథారిటీ కన్సల్టెంట్‌గా అనేక ఉన్నత పదవులను నిర్వహించారు.  దక్షిణ భారత రాష్ట్రం కేరళకు చెందిన డాక్టర్ మాథ్యూ త్రివేండ్రం మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. పెళ్లి తర్వాత భార్య వల్సాతో కలిసి యూఏఈకి వెళ్లాడు. వీరి కూతురు మరియం (ప్రియ) ప్రభుత్వ రంగంలో పనిచేస్తోంది.  అతని అంకితభావం, కృషికి గుర్తింపుగా యూఏఈ 2004లో డాక్టర్ మాథ్యూ మరియు అతని కుటుంబానికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. అతను 2018లో అబుదాబి అత్యుత్తమ సేవా అవార్డును కూడా అందుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com