నయనతారతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా హారర్ చిత్రం
- June 14, 2016
తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న నయనతార ప్రధాన తారగా ఓ హారర్ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మురగదాసు రామస్వామి దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నయనతార నటించనున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో నయనతార పాత్ర ఆసక్తికరంగా వుంటుంది. ఉత్కంఠను కలిగించే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం అందరిలోనూ ఉత్సుకతను కలిగిస్తుంది. ఈ నెల 18 నుంచి చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. మా సంస్థలో విభిన్నమైన సినిమాలను రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







