తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
- July 14, 2024
ఒడిశా: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవేక్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు.రత్నభండార్ లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. కాసేపట్లో రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు, తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







