పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండైన దుబాయ్ విమానం..మహిళ మృతి
- July 14, 2024
యూఏఈ: దుబాయ్ నుంచి కొలంబో వెళ్లే ఫ్లైదుబాయ్ విమానం బుధవారం కరాచీలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. “జులై 10న దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) నుండి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సిఎమ్‌బి)కి ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్‌జెడ్ 569 వైద్యపరమైన కారణాల వల్ల కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (కెహెచ్ఐ) మళ్లించారు. మొత్తం ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం తిరిగి ప్రారంభమైంది." అని ప్రతినిధి తెలిపారు. కలిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసారు. మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఫ్లైదుబాయ్ మరిన్ని వివరాలు అందివ్వలేదు.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి సైఫుల్లా ఖాన్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలంక మహిళ గురించి వైద్య అత్యవసర పరిస్థితిని తెలిపారు. ఎఫ్‌జెడ్ ఫ్లైట్ 569 దుబాయ్ నుండి కొలంబోకు వెళ్తోందని, విమానం కరాచీలో రాత్రి 11 గంటలకు ల్యాండ్ అయిందని ఖాన్ చెప్పారు. ఆమె మృతదేహాన్ని మాలిర్‌లోని ఖిద్మత్-ఎ-ఖల్క్ ఫౌండేషన్‌కు పంపారని, అనంతరం ఫ్లైదుబాయ్ విమానం తెల్లవారుజామున 3 గంటలకు [గురువారం] బయలుదేరింది. మహిళ బాడీని మరొక విమానంలో శ్రీలంకకు తరలించారు. ”అని ఖాన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







