వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్..
- July 14, 2024
వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. జకోవిచ్‌ను 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లను అల్కరాజ్ తేలికగానే గెలిచాడు. మూడో సెట్‌లో మాత్రం జకోవిచ్ తో పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్ 6-6తో సమం అయింది.
దీంతో ట్రై బ్రేకర్‌కు వెళ్లడంతో మరోసారి ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. అల్కరాజ్‌ను కట్టడి చేసేందుకు జకోవిచ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రై బ్రేకర్‌లో జకోవిచ్ ను అల్కరాజ్ 7-4తో ఓడించాడు. అల్కరాజ్ వింబుల్డన్ విజేతగా నిలవడం ఇది వరుసగా రెండోసారి. జకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. 25వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న కల నెరవేరలేదు.
వింబుల్డన్‌లో ఫైనల్ పోరును ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వీక్షించారు. ఫైనల్లో అల్కరాజ్, జకోవిచ్ పోరు ఉత్కంఠ భరితంగా ఉంటుందని ముందే ఊహించారు. టెన్నిస్ అభిమానులు కోరుకున్న ఆ ఫైట్ నిజంగానే అంతే ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్ టికెట్లు కూడా క్రీడా చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక రేట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







