అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకుల పై కేసు..
- July 14, 2024
ముంబై: ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అట్టహాసంగా శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎందరో అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై దీవెనలు అందించారు. జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో అనంత్ అంబానీ.. ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
ఈరోజు తో ఈ పెళ్లి వేడుకలు పూర్తి అయ్యాయి. అయితే ఈ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది. అల్లూరి వెంకటేశ్ అనే యూట్యూబర్ తో పాటు మరో యువకుడి పేరు షఫీ షేక్ లకు పెళ్లి ఆహ్వానం లేకపోయినా వెళ్లడం తో పోలీసులు కేసు నమోదు చేసారు. వారిద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసుకున్న ముంబయి బీకేసీ పోలీసులు… ఆ ఏపీ యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేశారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







