సంతానోత్పత్తి సమస్యలను తీర్చే దివ్యౌషధం కలోంజీ సీడ్స్.!
- July 15, 2024
కలోంజీ సీడ్స్ లేదా నల్ల జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవారి పట్ల ఈ కలోంజీ సీడ్స్ ఓ దివ్య వరంగా చెబుతున్నారు.
ఈ సీడ్స్‌ని డైట్లో చేర్చుకోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయట. అలాగే పీసీఓడీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు సైతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు సమస్యలు కూడా దూరమవుతాయట. హార్మోన్ల అసమతుల్యత సమస్యలను తీర్చడంలో కలోంజీ సీడ్స్ కీలక పాత్ర వహిస్తాయ్. తద్వారా పీరియడ్స్ సమస్యలు తగ్గించడంలో ఈ విత్తనాలు బాగా యూజ్ అవుతాయని చెబుతున్నారు.
పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా వుంచడంలో కలోంజీ సీడ్స్ ప్రభావవంతంగా పని చేస్తాయ్. అందుకే, గర్భం దాల్చాలనుకునే ఆడవారికి ఇవి మేలు చేస్తాయ్. మెనోపాజ్ (పీరియడ్స్ ఆగిపోవడం) టైమ్‌లో మహిళలు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు కూడా కలోంజీ చిట్కా పని చేస్తుందట.
చక్కెర వ్యాధిగ్రస్తులకు కూడా కలోంజీ సీడ్స్ మంచి ఉపయోగకారిగా పని చేస్తాయని చెబుతున్నారు. రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో వుంచి అతిగా తినాలన్న కోరికను తగ్గిస్తాయ్. దాంతో చక్కెర వ్యాధిగ్రస్తులు హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు.
అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా వీటిలో ఎక్కువ. ఆర్ధరైటిస్ సమస్యలున్న వారు కలోంజీ సీడ్స్ తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







