మాస్ రాజాకే ఎందుకిలా.!

- July 16, 2024 , by Maagulf
మాస్ రాజాకే ఎందుకిలా.!

మాస్ రాజా రవితేజ హీరోయిన్ల విషయంలో ఈ మధ్య వరుసగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముసలి హీరో, కుర్ర హీరోయిన్లతో రొమాన్స్.. అంటూ సోషల్ మీడియాలో రవితేజ పట్ల చాలా నెగిటివిటీ వినిపిస్తోంది.

అయితే, చాలా మంది పెద్ద వయసున్న హీరోలు, కుర్ర హీరోయిన్లతో కలిసి నటిస్తున్నారు. అవసరమున్న మేర ఆన్ స్ర్కీన్ రొమాన్స్ కూడా పండిస్తున్నారు. కానీ, ఎందుకో తెలీదు రవితేజ చేస్తున్న ఆన్ స్ర్కీన్ రొమాన్స్ మాత్రం అస్సలు సెట్ కావడం లేదు.

ఇది ట్రోలింగే కాదు, నిజంగా నిజమే. ఈ విషయంలో రవితేజ కాస్త ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే లేకపోలేదు. హీరోయిన్లను చూపించడంలో డైరెక్టర్లు విఫలమవుతున్నారా.? లేదంటే, సినిమాటోగ్రఫీ యాంగిల్ రాంగా.? అనేది తెలియడం లేదు కానీ, నిజంగానే రవితేజ సినిమాలో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ సెట్ కావడం లేదు.

నిజానికి ఈ మధ్య రవితేజ చాలా మంది కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తున్నారు. కొత్తగా పరిచయమైన హీరోయిన్లకు తన సినిమాల్లో ఛాన్సిచ్చి స్టార్‌డమ్ హోదా కూడా కల్పిస్తున్నారు. కానీ, ఎక్కడో తేడా కొడుతోంది. అనవసరమైన రొమాన్స్‌కి చోటిచ్చి.. ఇలా అందరి చేతా ట్రోల్స్‌కి గురి కావల్సి వస్తుంది.

చిరంజీవి, బాలకృస్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా చాలా మంది సీనియర్ హీరోలు, కుర్ర హీరోయిన్లతో కలిసి నటిస్తున్నారు. అవసరమైతే రొమాంటిక్ సీన్లు కూడా పండిస్తున్నారు. కానీ, రవితేజ కన్నా సీనియర్లయిన వాళ్లకి లేని ఈ జుగుప్స రవితేజ విషయంలోనే ఎందుకు.? మాస్ రాజా జర్రంత నువ్వే ఆలోచించి సరి చేసుకోవాలె.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com