అర్థరాత్రి జూనియర్లపై విరుచుకుపడిన సీనియర్లు.. ఏకంగా ఇనుప బకెట్లు, పెట్టెలతో దాడి

- July 17, 2024 , by Maagulf
అర్థరాత్రి జూనియర్లపై విరుచుకుపడిన సీనియర్లు.. ఏకంగా ఇనుప బకెట్లు, పెట్టెలతో దాడి

అర్థరాత్రి జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మంగళవారం పాఠశాలలో జూనియర్లు, సీనియర్ విద్యార్థులకు స్వల్ప వాగ్వాదం జరింగింది. ఈ క్రమంలో రెండు వర్గా మధ్య గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థరాత్రి దాటిన తరువాత ఉన్నట్టుండి జూనిర్లందరిని సీనియర్లు ఓ గదిలో బంధించారు. అనంతరం చేతికి దొరికిన ఇనుప పెట్టెలు, బకెట్లతో వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో రాకేష్ అనే విద్యార్థికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకొమ్మని పంపితే ఇలా ప్రాణాలు పోయేలా కొట్టుకోవడం ఏంటని సినీయర్లను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సినియర్ విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com