'సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తరలిపోవచ్చు' - నాస్కామ్‌ హెచ్చరిక!

- July 17, 2024 , by Maagulf
\'సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తరలిపోవచ్చు\' - నాస్కామ్‌ హెచ్చరిక!

బెంగళూరు: ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రైవేటు సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (NASSCOM) కోరింది. ఇటువంటి ఆంక్షలు విధిస్తే, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడి, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తరలివెళ్లడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదే అంశంపై ప్రైవేటు రంగ నిపుణులు, సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ హెచ్చరించారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని బయోకాన్ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌ షా సూచించారు. నైపుణ్యమున్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com