త్వరలో జాబ్ క్యాలెండర్: మంత్రి శ్రీధర్ బాబు
- July 17, 2024
హైదరాబాద్: త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని..నిరుద్యోగులెవరు అధైర్య పడొద్దని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో అంతర్జాతీయ స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైద్యం, విద్యకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ఎంఎస్ఎంఈ పార్క్‌ను కడ్తాల్‌లో ఏర్పాటు చేస్తామని, వనపర్తిలో ఐటీ పార్క్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. సర్వారెడ్డి పల్లిలో ఆహార శుద్ధి యూనిట్, ఇండస్ట్రీయల్ పార్క్ తీసుకొస్తామన్నారు.
ఇక రైతులంతా ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ రేపు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. డీఎస్సీ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిందని గుర్తు చేశారు. విపక్షాల ఉచ్చులో యువత పడొద్దని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







