ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాలు..40 మంది మృతి

- July 17, 2024 , by Maagulf
ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాలు..40 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు 40 మంది మృతి చెందారు. గత కొద్దీ రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడం తో అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయం అయ్యాయి. నదుల్లో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు. అలాగే, 347 మందికి గాయాపడ్డారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది.

తాలిబాన్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఆఫ్ఘనిస్తాన్‌కు విదేశీ సహాయం చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు దాని ప్రభావం ప్రస్తుత వరదలపై కూడా పడింది. స్థానికంగా ఉన్న వైద్యులు కొంతమంది అక్కడి వారికి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 400 ఇళ్ల వరకు కూలిపోగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. రోడ్లపై భారీగా నీరు పారుతుంది, ఇళ్లలోకి సైతం చేరుతుంది. ఇటీవల ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com