జీసీసీ దేశాల్లో కూడా పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్?
- July 18, 2024
యూఏఈ: ఒమన్ వ్యక్తిగత ఆదాయపు పన్నును అమలు చేస్తుందని వార్తలు నేపథ్యంలో జీసీసీ దేశాల్లో అది మొదటి దేశం అవుతుంది. షురా కౌన్సిల్ ముసాయిదా చట్టాన్ని స్టేట్ కౌన్సిల్‌కు రిఫర్ చేసింది. దీనిని 2025లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు కూడా వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇతర జీసీసీ దేశాలలో పన్నును ప్రారంభించేందుకు ఒమన్‌ను టెంప్లేట్‌గా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. కాగా, వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే ఆలోచన లేదని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హాజీ అల్ ఖౌరీ చెప్పారు.
ఇదిలా ఉండగా, యూఏఈ మరియు ఇతర GCC దేశాలు పెట్రోడాలర్లకు దూరంగా తమ ఆదాయాలను విస్తరించుకోవడానికి కొత్త పన్నులను ప్రవేశపెడతాయని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. యూఏఈ ఇటీవల తన ఆదాయాలను పెంచుకోవడానికి కార్పొరేట్ ఆదాయాలపై 9 శాతం పన్నును ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలు..
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!







