‘డబుల్ ఇస్మార్ట్’.! పూరీ అప్పుడలా.! ఇప్పుడిలా.!

- July 18, 2024 , by Maagulf
‘డబుల్ ఇస్మార్ట్’.! పూరీ అప్పుడలా.! ఇప్పుడిలా.!

ఈ ఆగస్టు 15కి గ్రాండ్‌‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్‌‌కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. కాగా, ఈ సినిమా విషయంలో ఓ చిన్న వివాదం సరికొత్తగా తెరపైకి వచ్చింది.

సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లు ఒక్కొక్కటిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్లింప్స్, ఫస్ట్ సింగిల్.. అంటూ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వదులుతూనే వున్నారు చిత్ర యూనిట్.

మొన్న వదిలిన ‘స్టెప్పా మార్..’ మాస్ సాంగ్‌కి భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో సాంగ్ వదిలారు. కల్లు దుకాణం బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిన ఈ సాంగ్‌ కూడా మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా వుంది. అయితే, అసలు సమస్యేంటంటే, ఈ సాంగ్ మధ్యలో ‘ఏం చేయమంటావ్ మరి..’ అని తెలంగాణా మాజీ సీఎం అప్పట్లో టీఆర్‌ఎస్ సమావేశాల్లో రెగ్యులర్‌గా వాడే పద ప్రయోగాన్ని బిట్‌లా వాడేశారు.

గతంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ టైమ్‌లోనూ తెలంగాణా ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించాడని అప్పట్లోనూ ఓ వివాదం పూరీ జగన్నాధ్‌పై వుంది. ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి మాటల్ని అలా అవమానకరంగా ఐటెం సాంగ్ తరహా సన్నివేశంలో వాడి అవమానిస్తారా.? అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న రచ్చ జరుగుతోంది. ఈ రచ్చ ఇలాగే చిన్నగా సమసిపోతే ఫర్వాలేదు. కానీ, చిలికి చిలికి గాలివానయితే, అది సినిమాకి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో చెప్పలేం మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com