జీన్స్ వేసుకుంటున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతి.!

- July 23, 2024 , by Maagulf
జీన్స్ వేసుకుంటున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతి.!

బిగుతుగా వున్న దుస్తులు శరీరానికి అందంగా వుంటే వుండొచ్చు గాక. కానీ, అసౌకర్యంగా వుంటాయనడంలో నిస్సందేహం. కానీ, నేటి యువత ట్రెండ్ పేరు చెప్పి, స్టైల్ పేరు చెప్పి టైట్ ఫిట్స్‌కి ఎక్కువి ఇష్టపడుతున్నారు. కాదు కాదు అలవాటు పడుతున్నారు కూడా.

అయితే, టైట్ ఫిట్స్‌లో ఎక్కువ టైమ్ వుండిపోతే.. అది కూడా డే అండ్ నైట్ వుండిపోతే ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా టైట్ ఫిట్స్ లేదా జీన్స్ ప్యాంట్‌తో నిద్రపోయే అలవాటుంటే వెంటనే మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. జీన్స్‌ ధరించి పడుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలతో పాటూ, కండరాల సమస్యలు తలెత్తుతున్నాయట.

ఆడవారిలో పీరియడ్స్ సమస్యలు, రకరకాల అజీర్తి, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తాజా సర్వేలో తేలింది.

సహజంగానే బిగుతుగా వున్న దుస్తులు ధరించి నిద్ర పోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. దాంతో నిద్ర లేమి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయ్.

నిద్ర సక్రమంగా లేకుంటే, డే మొత్తం చికాకు, అసహనం, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్. అంతేకాదు, మహిళల్లో గర్భాశయం, పొత్తి కడుపుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి సంతానోత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు సూచిస్తున్నారు. మగవారిలోనూ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోయే ప్రమాదమున్నట్లు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com