మెగా పవర్ స్టార్ రెస్పెక్ట్‌లో తగ్గేదే లే.! మరో అంతర్జాతీయ గౌరవం.!

- July 23, 2024 , by Maagulf
మెగా పవర్ స్టార్ రెస్పెక్ట్‌లో తగ్గేదే లే.! మరో అంతర్జాతీయ గౌరవం.!

మెగాస్టార్ తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో తండ్రి లెగసీని నిలబెట్టేశారు. తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా తన ఇమేజ్‌ని దేశ విదేశాల్లో చాటి చెప్పుకుంటున్నారు. అలాగే, తెలుగు సినిమా ఖ్యాతిని సైతం విదేశాల్లో చాటి చెబుతున్నారు రామ్ చరణ్.

ఈ నేపథ్యంలోనే అనేక అరుదైన అంతర్జాతీయ గౌరవ పురస్కారాలకు రామ్ చరణ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి అరుదైన గౌరవమే ఇంకోటి రామ్ చరణ్‌ని వరించింది.

ఆస్ట్రేలియా లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ 15 వ ఎడిషన్ వేడకలకు రామ్ చరణ్‌ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకలకు ఈ సారి రామ్ చరణ్ రావడం తమకెంతో ఆనందంగా వుందనీ, మరుపురాని జ్ఞాపకంగా గుర్తుంచుకుంటామనీ ఫిలిం ఫెస్టివల్ టీమ్ తెలిపింది.

అలాగే, ఈ వేడుకల్లో రామ్ చరణ్ నటించిన సినిమాలను కూడా ప్రదర్శిస్తామని టీమ్ తెలిపింది. ఆగస్టు 15 నుంచి, 25 వరకూ ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయ్.

మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com