యూఏఈలో VPN స్కామ్..!
- July 23, 2024
యూఏఈ: యూఏఈ నివాసి నూర్ అహ్మద్ చాలా వారాలుగా తన పోస్ట్-పెయిడ్ మొబైల్ ఖాతా నుండి రోజూ Dh3ని కోల్పోతున్నాడు. అతను క్రెడిట్ పరిమితిని చేరుకున్నట్లు అతని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుండి సందేశం వచ్చే వరకు అతనికి ఈ విషయం తెలియదు. ‘టెలికాం సర్వీస్ ప్రొవైడర్ యొక్క కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లతో చెక్ చేయించగా.. నేను ఇన్స్టాల్ చేసిన VPN ద్వారా ఛార్జీ విధించబడుతుందని గుర్తించాను. అందుకని వెంటనే అన్ఇన్స్టాల్ చేసాను” అని తెలిపాడు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్క నెలలోనే 200 దిర్హామ్‌లను కోల్పోయిన అహ్మద్.. అన్ఇన్స్టాల్ చేయగానే తన బ్యాలెన్స్ కోల్పోవడం ఆగిపోయింది.
ఇదే పద్ధతిలో అనేకమంది డబ్బు పోగొట్టుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆడియో-వీడియో కమ్యూనికేషన్ల కోసం VPN యాప్‌ను ఇన్స్టాల్ చేసిన మరో దీర్ఘకాల నివాసి మసూమ్ ఫాతిమా.. రీఛార్జ్ చేసిన రెండు రోజుల్లోనే తన మొబైల్ బ్యాలెన్స్ మొత్తాన్ని కోల్పోయింది. “నేను నా మొబైల్ ఖాతాను రీఛార్జ్ చేసినప్పుడల్లా, ఫండ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లో ఖాళీ అయిపోయేది. ఇది నాకు చాలాసార్లు జరిగింది. నా స్నేహితుడు చెప్పగానే VPN యాప్‌ని తీసివేసాను. క్రెడిట్ కోల్పోవడం ఆగింది. ”అని ఫాతిమా చెప్పారు.
యూఏఈలో నివాసితులు VPNని ఉపయోగించడానికి అనుమతి ఉంది. కానీ దాని దుర్వినియోగం కారణంగా చట్టపరంగా ఇబ్బందుల్లో పడవచ్చు. ఫలితంగా జైలుశిక్ష మరియు Dhh2 మిలియన్ వరకు జరిమానా ఎదుర్కొనాల్సి వస్తుంది.
“ఎవరైనా తమ మొబైల్లో హానికరమైన VPN యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఉంటే, స్కామర్ వారి ఫోన్‌ను యాక్సెస్ చేయగలరు. అనధికారిక కొనుగోళ్లను చేయగలరు. ఇది వ్యక్తి పోస్ట్-పెయిడ్ లేదా ప్రీ-పెయిడ్ మొబైల్ బ్యాలెన్స్ నుండి తగ్గుతుంది. హానికరమైన VPN యాప్ యూజర్స్ ఖాతాలపై నియంత్రణను పొందగలదు. స్కామర్లు Apple App Store లేదా Google Play Store వంటి యాప్ స్టోర్ల నుండి వినియోగదారు అనుమతి లేకుండా కొనుగోళ్లు చేస్తుంది.” అని సెంటినెల్ వన్‌లో METAలో సొల్యూషన్ ఇంజనీరింగ్ ప్రాంతీయ సీనియర్ డైరెక్టర్ ఎజెల్డిన్ హుస్సేన్ తెలిపారు. కస్టమర్లు తమ ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







