E311లో 60% తగ్గిన ప్రయాణ సమయం..!

- July 24, 2024 , by Maagulf
E311లో 60% తగ్గిన ప్రయాణ సమయం..!

యూఏఈ: E311 (షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్)లో ట్రాఫిక్ సమస్యలను పూర్తి చేసినట్టు దుబాయ్ యొక్క రోడ్లు మరియు రవాణా అథారిటీ వెల్లడించింది. దాంతో వాహనదారుల ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిందని పేర్కొంది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి రబాత్ స్ట్రీట్ వరకు ఎగ్జిట్ సామర్థ్యం 50 శాతం పెరిగింది. గంటకు 3,000 వాహనాల నుండి గంటకు 4,500 వాహనాలకు పెరిగింది. ఇది షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి రబాత్ స్ట్రీట్ నుండి బిజినెస్ బే క్రాసింగ్ వైపు ప్రయాణ సమయాన్ని 10 నిమిషాల నుండి 4 నిమిషాలకు తగ్గిస్తుందని, ఇది 60 శాతం తగ్గింపును సూచిస్తుందని ఆర్టీఏ వెల్లడించింది.  

రాబత్ స్ట్రీట్‌కు దారితీసే ఎగ్జిట్ 55 ఇప్పుడు 600 మీటర్లకు విస్తరించారు. దీంతో మొత్తం లేన్‌ల సంఖ్య మూడుకు చేరింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి రబాత్ స్ట్రీట్ వరకు ఎగ్జిట్ ట్రాఫిక్ విస్తరణ 2024లో దుబాయ్ అంతటా 45 స్థానాలను కవర్ చేసే RTA అభివృద్ధి ప్రాజెక్టులలో భాగంగా ఉంది. ఇటువంటి అప్డేట్ లుదుబాయ్ స్థిరమైన వృద్ధికి తోడ్పడతాయని, దుబాయ్‌ని నివసించడానికి ఉత్తమ నగరంగా నిలబెడుతుందని ఆర్టీఏ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com