పురుషులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
- July 24, 2024
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడమే ఆలస్యం ఎన్నికల్లో ప్రకటించిన హామీలపై తొలి సంతకం చేసారు సీఎం రేవంత్. ముందుగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వారిలో సంతోషం నింపారు. ఇక ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన దగ్గరి నుండి బస్సు లన్ని కిటకిటలాడుతున్నాయి. ఏ బస్సు చూడు మహిళాలతో నిండిపోతున్నాయి. ఇదే సందర్బంగా ఈ పధకం ఫై పురుషులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం గుడ్ న్యూస్ అందించారు.
ఆర్టీసీ బస్సుల్లో ఎంత రద్దీ ఉన్న పురుషులు కూర్చొని ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు తెలిపారు. త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకునే మెరుగైన రవాణా వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. 3035 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఉగ్యోగ కల్పన జరుగుతుందని.. పురుషులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







