లీసెస్టర్ నగరంలోని చార్లీ చాప్లిన్ విగ్రహం వద్ద సచిన్
- June 15, 2016
'22 అడుగుల మధ్యే నా 24 ఏళ్ల జీవితం గడిచిపోయింది'.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్తున్న సమయంలో అభిమానులు, కుటుంబ సభ్యుల ఎదుట సచిన్ తెందుల్కర్ కన్నీళ్లతో చెప్పిన మాట. 16 ఏళ్ల వయసులోనే మైదానంలోకి అడుగుపెట్టిన సచిన్ తన అసమాన బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసి.. క్రికెట్ చరిత్రలో లెక్కలేని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే 2013 చివర్లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ అప్పటి నుంచి కుటుంబ సభ్యులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ విహార యాత్రలతో సమయం గడుపుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ వెళ్లిన సచిన్ అక్కడ లీసెస్టర్ నగరంలోని చార్లీ చాప్లిన్ విగ్రహం వద్ద ఫొటో దిగి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.'మనం హాయిగా నవ్వుకోని రోజు వృథాగా గడిచిపోయినట్లే. నవ్వించడంలో ఎప్పుడూ ఓడిపోని ప్రతిభావంతుడైన వ్యక్తి.. హాస్య నటుడు, దర్శకుడు' అంటూ సచిన్ చాప్లిన్ గురించి రాసుకొచ్చాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







