అస్సాంలోని సోనాపూర్లో ఘోర బస్సు ప్రమాదం..
- June 15, 2016
మేఘాలయ రాష్ట్ర సరిహద్దు, అస్సాంలోని సోనాపూర్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంగళవారం రాత్రి సిల్చార్ నుంచి గౌహతికి వెళ్తున్న బస్సు మేఘాలయలోని ఈస్ట్ జైంటియా పర్వత ప్రాంతంలో సోనాపూర్ మందిర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 35మంది ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.బుధవారం ఉదయం ఐదుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు పడిన లోయ సుమారు 500 అడుగుల లోతు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







