రజనీకాంత్ కుమార్తె సౌందర్య శ్రీకాళహస్తిలో పూజలు..
- June 15, 2016
ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య బుధవారం శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చిత్రం విజయవంతం కావాలని చిన్న కుమార్తె సౌందర్య ఇవాళ ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది...సౌందర్య రజనీకాంత్ కు స్వాగతం పలికి, రాహుకేతు పూజలు చేయించారు.స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. కాగా భారీ అంచనాల నడుమ అత్యంత అట్టహాసంగా విడుదల అవుతుందనుకున్న 'కబాలి' ఆడియో చాలా సాదా సీదాగా బయటకు వచ్చేసింది. శనివారం సాయంత్రం అత్యంత సాధారణంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇవ్వడం ద్వారా ఆడియోను విడుదల చేశారు.
మరోవైపు సినిమా విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







